కరువుకాటకాలు తొలగిపోవాలంటే.. వర్షాలు కురవాలంటే.. ఏం చేయాలి?

సోమవారం, 10 ఆగస్టు 2015 (18:01 IST)
కరువుకాటకాలు తొలగిపోవాలంటే... వర్షాలు కురవాలంటే.. పాడిపంటలు సమృద్ధిగా పండాలంటే.. పరమశివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయాలని పండితులు అంటున్నారు. పరమశివుడికి ఒక్కో అభిషేక ద్రవ్యంతో అభిషేకాన్ని జరపడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని వారు చెప్తుంటారు. అలా పరమేశ్వరుడిని 'శుద్ధ జలం'తో అభిషేకించడం వలన కరవుకాటకాలు దరిచేరవు. 
 
లోకంలోని జనులంతా సుఖసంతోషాలతో జీవించడానికి అవసరమైనది వర్షం. సకాలంలో వర్షాలు కురవడం వల్లనే పంటలు పండుతాయి. పంటలు బాగా పండినప్పుడే ఆహార కొరత ఏర్పడకుంటా ఉంటుంది. నీటి కరువు ఏర్పడకుండా ఉండాలంటే పరమేశ్వరునికి శుద్ధ జలంలో అభిషేకం చేయాలని పురోహితులు అంటున్నారు. 
 
సమస్త జీవరాశి మనుగడ నీటిపైనే ఆధారపడి వుంటుంది. అలాంటి నీరు వర్షం వలన లభిస్తుంది.. ఆ వర్షం పలకరించని పరిస్థితుల్లో ఆదిదేవుడి అనుగ్రహం అవసరమవుతుంది. అలాంటప్పుడు ఆ ప్రాంతలోని వాళ్లు శివుడికి శుద్ధ జలంతో అభిషేకం చేయడం వలన, ఆ స్వామి కరుణా కటాక్షాల వలన వర్షం కురిసి కరువుకాటకాల బారినపడకుండా తప్పించుకోవచ్చునని పురోహితులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి