కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామికి వచ్చే కానుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారి హుండీలో రోజుకే కోట్లాది రూపాయలు కానుకగా వచ్చిపడుతుంటాయి. ఈ హుండీలో పడిన డబ్బును లెక్కించే ప్రక్రియను ఇన్నాళ్లు టీటీడీ ఆధ్వర్యంలోనే జరిగేది. అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.
కోట్లాది మంది భక్తులు నిత్యమూ వెంకన్నకు సమర్పించుకునే హుండీ కానుకలను లెక్కించే బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం హుండీలో పడే కరెన్సీ, బంగారు, వెండి కానుకల మదింపును టీటీడీ ఆధ్వర్యంలో రిటైర్డ్ ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగులు లెక్కిస్తుంటారు. వీరిని పరకామణి సేవకులుగా పిలుస్తారు.