తిరుమలలో మోస్తారుగా పెరిగిన భక్తుల రద్దీ

ఆదివారం, 17 ఏప్రియల్ 2016 (11:15 IST)
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న తిరుమలలో రద్దీ మోస్తారుగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య పెరిగినట్లు తితిదే భావిస్తోంది. శనివారం తిరుమల ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. వారాంతం కావడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. 
 
ఆదివారం ఉదయానికి సర్వదర్శనం కోసం 18 కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 6 గంటలు పడుతోంది. కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి 2 గంటల సమయంపడుతోంది. శనివారం శ్రీవారిని 77,619 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.54 కోట్లుగా వసూలైంది. 

వెబ్దునియా పై చదవండి