ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు.. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. అక్టోబరు 8వ తేదీన చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్ 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబర్ 29వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు.
సెప్టెంబరు 29న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం.
అక్టోబరు 1వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం
అక్టోబరు 2వ తేదీన ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం.
అక్టోబరు 3వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం.
అక్టోబరు 4వ తేదీన ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం (రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు).
అక్టోబరు 5వ తేదీన హనుమంత వాహనం, రాత్రికి స్వర్ణరథం (సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు)
అక్టోబరు 6వ తేదీన సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం.
అక్టోబరు 7వ తేదీన రథోత్సహం, రాత్రి అశ్వవాహనం