తిరుమల శ్రీనివాసుడు ఆ రికార్డ్ సాధించాడు.. ఏంటది?

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (19:57 IST)
ఆపద మ్రొక్కులవాడికి నిలువు దోపిడీనే అంటుంటారు పెద్దవారు. అంటే స్వామివారిని వేడుకొన్న తరువాత మ్రొక్కులు తీర్చుకునే భక్తులు కావాల్సినంత డబ్బులు హుండీలో సమర్పిస్తారన్నది అర్థం. స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. స్వామివారి ప్రాముఖ్యత అలాంటిది.
 
ఈ యేడాది హుండీ ఆదాయం బాగా పెరిగింది. గతంతో పోలిస్తే హుండీ ఆదాయం రెట్టింపు అయ్యింది. అంతేకాదు రికార్డ్‌ను సృష్టించింది. ఈ యేడాదిలో ఇప్పటికే మూడుసార్లు వందకోట్ల రూపాయల ఆదాయం దాటినట్లు టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. 
 
శ్రీవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఈ యేడాది మార్చిలో 105 కోట్ల రూపాయల ఆదాయం, జూన్ నెలలో వంద కోట్ల రూపాయలు, జూలైలో 106.28 కోట్ల రూపాలయ హుండీ ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు చెబుతున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డ్‌గా కూడా టిటిడి ఈఓ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు