భారతీయులు వేదాల నుంచి ఉద్భవించారు: శ్వేత భవనం నుంచి టిటిడి ఛైర్మన్‌ చదలవాడ

శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (16:58 IST)
భారతీయులు వేదాల నుంచి ఉద్భవించారని, మనదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు వారివారి సంప్రదాయాలను గౌరవించుకుంటూ భగవంతుని అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలని టిటిడి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి అన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో జరిగిన బడుగు, బలహీనవర్గాల అర్చక పురోహితం, పూజా విధానంపై శిక్షణా తరగతులను ప్రారంభించారు. 
 
ఈ సంధర్భంగా చదలవాడ మాట్లాడుతూ వందల యేళ్ళుగా చక్కటి పూజా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండడం వలన, దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి విశ్వవ్యాప్తంగా కోట్లాదిమందిని ఆకర్షిస్తున్నారని తెలిపారు. హరిజన, గిరిజన కారులు ఇక్కడ నేర్చుకుని వెళ్ళిన తరువాత వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఇఓ సాంబశివరావు, జెఇఓ పోలా భాస్కర్‌‌లు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి