వెంకన్న సన్నిధిలో సిఫారసుకు తావులేదు : జేఈవో శ్రీనివాసరాజు

శనివారం, 13 డిశెంబరు 2014 (17:04 IST)
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోబోమని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం జనవరి ఒకటో తేదీని పురస్కరించుకుని వైకుంఠ ఏకాదశి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 
 
ఈ ఏర్పాట్లపై ఆయన స్పందిస్తూ శనివారం నుంచి దివ్య దర్శనం టికెట్ల జారీని నిలిపివేసినట్లు తెలిపారు. టికెట్ల కోసం ప్రజాప్రతినిధులు జారీ చేసే సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. వీవీఐపీలకు కూడా పరిమిత సంఖ్యలోనే టికెట్లను జారీ చేస్తున్నట్టు వెల్లడించారు. సాధారణ భక్తులకు అసౌకర్యం కల్పించకూడదన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి