తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)భక్తులకు మరో శుభవార్త చెప్పింది. కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిపివేసిన అర్జిన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తుంది. అలాగే, స్వామి వారి దర్శనంతో పాటు వివిధ సేవల్లో భక్తులు కూడా పాల్గొనేలా అనుమతి ఇస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఇటీవల పునరుద్ధరించిన అర్జిత సేవా కార్యక్రమాల్లో భక్తులు కూడా పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.
శుక్రవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్ బుకింగ్ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.