వైకుంఠ ఏకాదశి: తిరుమలలో గోవింద నామ స్మరణ-Video

సోమవారం, 6 జనవరి 2020 (13:47 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలేశుని దర్శించేందుకు వచ్చిన భక్తుల గోవింద నామాలతో తిరుమల గిరులు మారుమోగాయి. ఏడాదిలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండడంతో స్వామివారి దర్శనానంతరం ఆ ద్వారాల్లో ప్రవేశించేందుకు భారీగా తిరుమలకు భక్తులు వచ్చారు.
 
తెల్లవారుజామున ఒంటి గంట నుంచే  ప్రోటోకాల్ విఐపి దర్శనం ప్రారంభమైంది. అనంతరం 3 గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం భక్తులను దర్శనానికి అనుమతించింది టిటిడి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాలుగు రోజుల పాటు అన్ని రకాల ఆర్జిత సేవలు ఇతర ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.
 
సామాన్య భక్తులకు ప్రధమ ప్రాధాన్యతనిస్తామని టిటిడి చైర్మన్ వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు