చేజెర్ల కపోతేశ్వర ఆలయానికి వెళ్దాం రండి

WD
మన దేశంలో అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో కపోతేశ్వర ఆలయం ఒకటి. ఇది మన రాష్ట్రంలోని చేజెర్లలో ఉంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెపుతారు. ఈ ఆలయంలోని ప్రత్యేకత అంతా శివలింగమే.

శిబిచక్రవర్తి పావురాన్ని కాపాడటం కోసం తన శరీరాన్ని త్యాగం చేసినందుకు ఈశ్వరుడు వరమిచ్చాడు. కపోతేశ్వరుడు అనే పేరుతో లింగరూపంలో శిబి చక్రవర్తి ఇక్కడే ఉండిపోయాడని స్థల పురాణం చెపుతోంది. చేజెర్లకు ఆ పేరు కూడా అలాగే వచ్చిందని చెపుతారు.

పావురం ప్రాణాలు కాపాడమని శిబి దగ్గరకు వచ్చిన ప్రాంతం కనుక చేరినజర్ల అనే పేరు వచ్చిందంటారు. వాడుకలో అది క్రమంగా చేజెర్లగా రూపాంతరం చెందింది.

చేజెర్లలోని కపోతేశ్వరుని ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణానికి కొంచెం నైరుతి దిశగా ఉన్న నకిరికల్లు మండలంలో ఉంది. చేజేర్ల గుంటూరుకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. చేజెర్లకు బస్సు సౌకర్యం ఉంది. చిన్న గ్రామం కనుక కాఫీ, ఫలహారాలు మాత్రమే దొరుకుతాయి. గుంటూరు నుంచి ఉదయం బయలుదేరి వెళితే... స్వామివారిని దర్శించుకుని సాయంత్రానికి తిరిగి రావచ్చు.

వెబ్దునియా పై చదవండి