శ్రీశైలం

WD

ఆదివారం, 3 జూన్ 2007 (18:05 IST)
భారతదేశంలో గల పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలము చాలా ప్రసిద్ధమయిన పావన పుణ్యక్షేత్రం. అశేష భక్త జనాన్ని తరింప చేసేటందుకు యిచ్చట గిరిపై వెలసిన స్వామి శ్రీమల్లి కార్జునస్వామి దేవేరి భ్రమరాంబదేవి రజితాద్రి వాసులైన గిరిజా శంకరులు త్లొలి యీ శ్రీశైలానికి స్వయంగా విచ్చేసి ఆనంద పరవశులయ్యారు. అందువల్ల కొంతకాలం యీ కొండమీదే నిలిచిపోయారు. ఆదిదంపతుల దివ్యదర్శనము కోసం దేవతా గణమంతా తరలి వచ్చింది. పార్వతీ పరమేశ్వరులవలన సురశ్రేష్టుల వలన యీ క్షేత్రము పరమపావన దివ్యక్షేత్ర మయ్యింది.

తన భక్తాగ్రగణ్యులయిన శిలాడ కరవీర నందికేశ్వరుల అభీష్టాన్ని మన్నించేటందుకు యీ శ్రీశైలములో సదాశివుడు లింగరూపుడై వెలిశాడు. యుగయాగాల భక్త కోటిని ఉద్ధరిస్తున్నాడు. రససిద్ధుడయిన ఆచార్య నాగార్జునుడు కైలాసము లోని రజితాద్రివలె భూలోకములో శ్రి శైల్నాని హేమాద్రిని చేయాలని ప్ర్నయతించాడు. ఆయన సంకల్పానికి ఏమి విఘాతము కలిగిందోగాని ఈ శ్రీశైలం బంగారు కొండగా చేయడము జరగలేదు.

దక్షిణ భారతములో గల ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో వున్నదీ దివ్య క్షేత్రము. ఈ జిల్లాలోని నందికొట్కూరు తాలుకాలో కృష్ణానదికి దక్షిణ తీరాన నల్లమల కొండలలో 15 వేల అడుగుల ఎత్తున ఉన్నదీస్వామివారి క్షేత్రము. దీనికి 40 మైళ్ళ ఈవలావలా ఎటు కూడా చిన్న గ్రామమైనాలేదు. దట్టమైన ప్రవేశమార్గాలు మరో నాలుగు ఉపమార్గాలు వున్నాయి. ఇవన్నీ దయాసింధువున అనేకమంది దేవతలతో యాత్రీకులను తరింపజేసే పుణ్యక్షేత్రాలు.

యీ క్షేత్రము ఇక్కడ ఏనాడు వెలిసిందోగాని దీని ప్ర్తశసినివేదాలు ఉపనిషత్తులు, ఇతి హాసాలు, చరిత్రలు వేయి విధాల వర్ణిస్తున్నాయి. పూర్వ ప్రస్తుత సాహిత్యంలో శ్రీశైలవర్ణనలు కోకొల్లలు. కృతయుగంలో హిరణ్య కశిపుడు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో పాండవులు, ఈ యుగంలో జగద్గురు శంకరాచార్య, ఆచార్య నాగార్జునుడు, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు ఆదిగాగల ఎందరెందరో ప్రముఖులు యిక్కడ మూలవిరాజట్టులని సేవించినట్లు శాసనాలు కట్టడాలు వెల్లడిస్తున్నాయి.

శ్రీశైలములోని మల్లిఖార్జున లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలో ఒకటి.
శ్లో: సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రిశైలే మల్లిఖార్జునమ్‌
ఉజ్జయిన్యాం మహాకాళ, మోంకారే పరమేశ్వరమ్‌
కేదారం హిమవతో రాష్ట్రే - ఢాకిర్యాం భీమశంకరమ్‌
వారణాస్యాంచ విశేశ్వర-త్ర్యంబకం గౌతమీతటే
వైద్య నాదం చితాభూమే - నాగేశం - దారుకావనే
సేతు బంధేచ రామేశం-ఘృశంచ శివాలయే

సోమనాధలింగం, మల్లిఖార్జున లింగం, మహకాళేశ్వర లింగం, ఓంకారేశ్వర లింగం, కేదారేశ్వరలింగం, భీమ శంకర లింగం, విశ్వేశ్వరలింగం, త్రయంబకేశ్వరలింగం, వైద్యనాథలింగం, నాగేశ్వరలింగం, రామేశ్వరలింగం, ఘృశ్మేశ్వర లింగం, పన్నెండు జ్యోతిర్లింగాలూ స్వయం ప్రతిష్టితాలు, అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత లింగాలు, ఏ ఒకరిచేతా ప్రతిష్టింపబడినవికావు. అనంతమైన తేజస్సు, వేదకాలము నాడికి పూర్వమునుండి ఇలాతలాన్ని, భక్త జనాన్ని తరింప చేస్తున్న లింగాలీ ద్వాదశ జ్యోతిర్లింగాలు.

శ్లో: కాశ్యాం మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనా దేవ శ్రిశైలే పునర్జన్మ న విద్యతే

కాశీలో మరణము, అరుణాచలంలో భగవన్నాను స్మరణము శ్రిశైలము స్వామి దర్శనము జన్మాంతర రాహిత్యాన్ని కలిగించి ముక్తిని సమకూర్చుతాయట

శ్లో : శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే
శ్రీశైల శిఖర దర్శనమాత్రం చేతనే ముక్తిజన్మ రాహిత్యం సంప్రాప్తించునట. మూలవిరాట్‌ అయిన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవేరి శ్రీ భ్రమరాంబ అష్టాదశ మహా శక్తులలోని భ్రామరీశక్తి.

శ్లో : లంకాయాం శాంకరీదేవీ, కామాక్షి కంచికాపురీ
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండే క్రమంచపట్టణే
అలంపురీ జోగులాంబ, శ్రిశైలే భ్రమరాంబికా
కొల్లాపురీ మహాలక్ష్మీ, మాహురేయ ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యే ద్రక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్య గౌరికా !
వారణాశి విశాలాక్షి, కాశ్మీ రేతు సరస్వతీ
అష్టాదశ పీఠాని, యోగినామతి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం పర్వశతృ వినాశనం
సర్వదివ్యహరం రోగం సర్వ సంపత్కరం శుభం


ప్రతిదినము ఒకసారియైనా పై మంత్రము పఠించినచో కోరినకోర్కెలు తీరుటలో సందేహం లేదు-అష్టాదశ పురాణాల్లోని స్కంధపురాణంలో శ్రిశైల ప్రశస్తి వక్కాణించబడింది. ఈ భాగం శ్రిశైల ఖండం అనే పేరుతో 22 అధ్యాయాలు, బౌద్ధవాజ్మయంలో కూడ శ్రిశైలం యొక్క విశిష్టతలు వర్ణించబడ్డాయి. 7వ శతాబద్దకాలంలో మన దేశాన్ని దర్శించవచ్చిన చైనా యాత్రికుడు యహుయానగ్‌ శ్రీశైలాన్ని అందు గల బౌద్ధధర్మాన్నీ తన గ్రంథములో వర్ణించాడు ఆంధ్ర-సంస్కృత-తమిళకవి శేఖరులు శ్రీశైలం మల్లిఖార్జున భ్రమరాంబల మహత్తులను గూర్చి ఎన్నెన్నో కావ్యాలు వ్రాశారు.

3వ శతాబ్దము నుండి 13వ శతాబ్దము వరకు మౌర్యులు గుప్తులు-నదులు పల్లవులు - విష్ణుకుండినులు - కదంబులు - రాష్ట్రకూటులు - కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగరరాజులు, గోల్కొండ నవాబులు, బీజపూరు సుల్తానులు, శివాజీ మొదలుగాగల రాజన్యుల పరిపాలనలోనే, వారి సమర్పణతో వారి సంరక్షణతో శ్రీశైలం వర్ధిల్లుతూ వచ్చింది. ఆ తరువాత ఆంగ్లేయుల పరిపాలన రావడముతో వారు ఈ క్షేత్రాన్ని శృంగేరి జగద్గురువుల అజమాయిషీకి అప్పజెప్పారు. 20వ శతాబ్దములో ప్రభుత్వం దీనికి మేనేజిమెంటు బోర్డును ఒక దానిని ఏర్పాటు చేసింది.

1948 వరకు యీ బోర్డు నిర్వహణసాగింది. 1949 నుండి 1954 వరకు ప్రత్యేక అధికారికి పరిపాలనాధికారము అప్పగించబడినది. 1964 ధర్మకర్తల సంఘము ఏర్పాటు చేయబడింది. 1947లో స్వాతంత్ర్యము వచ్చిన తరువాత ప్రభుత్వము దేవాలయాల అభివృద్ధి పట్లశ్రద్ధ వహించింది. 1962 తరువాత ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వము శ్రీశైలము పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాది. ఆ కీకారణ్యమధ్యస్థ శ్రీశైలంలో యాత్రికుల సౌ్యకరాలపట్ల వారి రాకపోకల వసతుల పట్ల శ్రద్ధవహించి యెన్నో వసతులను కలుగజేసింది.

అనంతమయిన ప్రకృతి సంపదలతో, యెంతో రమణీయంగా అలరారుతూ యాత్రికులను ్తభకి పారవశ్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రములో అమోఘములయిన ఖనిజాలు అపూర్వములయిన ఓషధులు, అగణితములయిన సిరసంపదలు అనంతముగా వున్నాయి. మందిరాలు, మఠాలు, వాగులు, కుండాలు, వనాలు, వాటికలు భక్తుల్ని యెంతగానో ఆకర్షిస్తుంటాయి. ఇది సాక్షాత్తు భూలోక కైలాసము.

శ్రీశైల పురాణ ప్రసిద్ధములైన శ్రీ పర్వతాలు మూడింటిలో ఒకటి. రెండవది శ్రిగిరి మహాయాన బౌద్ధాచార్యుడు, నాగార్జునుడు నివసించిన కొండ. మూడవది శ్రీ గిరికి శ్రినివాసుడు వేంకటేశ్వరస్వామిగా వెలసిన తిరుపతి కొండ. ఈ శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీ పర్వతము, శ్రీనగము అనే నామాంతములు గలవు. ఈ క్షేత్రానికి తూర్పున త్రిపురాంతకము, దక్షిణాన సిద్ధపటము, పడమట అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరము అను నాలుగు క్షేత్రాల్నునాయి. భక్తులు శ్రిశైలమునకు ఈ నాలుగు ప్రక్కలనుంచే ప్రవేశిస్తారు. వీటిని శ్రిశైల క్షేత్రానికి ప్రధాన ద్వారాలు అంటారు. ఇవిగాక మరో నాలుగు ఉపద్వారాలున్నాయి.

ఈశాన్యమున ఏలేశ్వరము, ఆగ్నేయమున సోమశిల, నైఋతియందు పుష్పగిరి వాయవ్యంలో సంగమేశ్వరము వున్నవి. శ్రిశైల క్షేత్రము తూర్పు పడమరలకు నాలుగు మైళ్ళు. ఉత్తర దక్షిణాలకు ఏడుమైళ్ళు విస్తరించి, ముప్పది చతురపు మైళ్ళ విస్తీర్ణములో అలరారుతూ భక్తకోటికి నయనానందకరము ముక్షువులకు జన్మసాఫల్యత సిద్ధింపజేయు పుణ్యభూమిగా, యోగులతో, భోగులతో, సిద్ధులతో, సాధకులతో యలరారే పవిత్ర పుణ్యక్షేత్రము.

పౌరాణిక ప్రశస్తి
శివకుమారులయిన విఘ్నేశ్వర, కుమారస్వాములకు తమలో ఎవరి వివాహం ముందని వాగ్వివాదం వచ్చింది. జననీజనకులయిన గిరిజాశంకరులను ఈ విషయమై ప్రశ్నించారు. ఎవరికి సమాధానం చెప్పలేక యెవరు మున్ముందుగా భూప్రదక్షిణము పూర్తి చేసుకుని వచ్చెదరో వారి వివాహం ముందుగా చేసెదమని చెప్పారు ఆ ఆదిదంపతులు. కుమారస్వామి తనమయూరాన్ని ఎక్కివెంటనే భూప్రదక్షిణానికి బయలుదేరాడు. తన ఎలుక వాహనముతో ఈ పని పూర్తి చేయడం అసాథ్యమని విఘ్నేశ్వరుడు కైలాసములో ఉండిపోయాడు.

వెబ్దునియా పై చదవండి