1వ అబ్బాయి మ్యాచ్ కాకపోతే 2వ అబ్బాయితో లవ్: గాళ్స్ లేటెస్ట్ ట్రెండ్

శనివారం, 28 జనవరి 2012 (17:04 IST)
WD
ప్రేమంటే ఇప్పుడు అవసరానికి వాడుకునే సాధనంగా మారిపోయింది. ప్రేమ పేరు చెప్పి వారి వెనకే తిరుగుతూ, ఆనక ఓకే చెప్పిన తర్వాత అవసరం మేరకు ఉపయోగించుకుని వదిలేసే వారు ఇటీవలి కాలంలో ఎక్కువై పోతున్నారు. ఇదివరకు ప్రేమ విషయంలో మోసపోయేవారిలో నూటికి 99 శాతం అమ్మాయిలే ఉండేవారు.

అమ్మాయిని ఎలాగో బుట్టలో వేసుకున్న అబ్బాయి, కొన్నాళ్లపాటు ఆ ప్రేయసికి మబ్బుల్లో చందమామను చూపించేవాడు. అలా ఎన్నో వెన్నెల సాయంత్రాలు గడిపేసి... ఆమెతో అన్ని అవసరాలు ముగిశాయి అని నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆమెను ఎలా వదిలించుకోవాలన్న దానిపై కసరత్తు చేసేవాడు. ఇటువంటి ఉదంతాలను మనం రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాము.

కాకపోతే ఇప్పుడు ట్రెండ్ కాస్త మారింది. దీనికితోడు దేశంలో అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్యా తక్కువైపోతోంది. ఈ కారణమో.. లేదంటే అమ్మాయిల మైండ్ సెట్ మారిందో తెలియదు కానీ.. చాలామంది గాళ్స్ తను ప్రేమించే అబ్బాయిల్లో కూడా ఆఫ్షన్స్ చూసుకుంటున్నారట.

మొదటిసారిగా పరిచయమైన వ్యక్తి నచ్చకపోతే.. మరొకరితో లవ్వాట సాగించేందుకు ఎలాంటి మొహమాటం పడటం లేదట. అలా సెకండ్ థాట్ రాగానే, ఆమెతో ప్రేమ కలాపాలు సాగించడానికి సదరు కొత్త ప్రియుడు రెడీ అయిపోతున్నాడట. మరి 1వ ప్రేమికుడి సంగతో.. అంటారా... అది గత చరిత్ర. మర్చిపోయి కొత్తగా వచ్చిన ప్రియుడితో కలిసి తిరగడమనే సరదాలో కాలం గడిపేస్తున్నారట ఈ నాటి లవ్ కపుల్స్. ట్రెండ్ ఇలా మారిందేమో...? అందుకే ఇలాంటి సంఘటనలను నేపథ్యంగా తీసుకుని సినిమాలను కూడా తీస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి