హనీమూన్‌ వెళ్తున్నారా?: 5 రొమాంటిక్ టిప్స్ ఇవిగోండి!

శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (18:07 IST)
పెళ్లి అనేది జీవితంలో మధురఘట్టం. అలాగే హనీమూన్ కూడా దంపతులుగా జీవితాన్ని కొనసాగించే జంటకు మధురమైన అనుభూతి. హనీమూన్ జ్ఞాపకాలు ఒక జంటకు జీవితాంతం మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. 
 
హనీమూన్‌కు వెళ్లే ప్రాంతాల్లోని అద్భుతమైన ప్రకృతి అందాలను కెమెరాలతో బంధించండి. వీటిలో మీ ఫోటోలు కూడా ఉండేలా చూసుకోండి. పరిమితి మేరకే కాకుండా భాగస్వామితో స్నేహంతో మెలగండి. సన్ సెట్‌ను ఎంజాయ్ చేయండి. భాగస్వామిని అప్పుడప్పుడు ఆట పట్టించండి. గిల్లికజ్జాలు ఆడండి. పిల్లో ఫైట్ కూడా చేయండి. భాగస్వామితో కలిసి డైనింగ్ ప్లాన్ చేసుకోండి. మధుర క్షణాలను అప్పుడప్పుడు కెమెరాల్లో బంధించండి. 
 
అలాంటి హనీమూన్ ట్రిప్‌ను బెస్ట్ టూర్‌గా నిలుపుకోవాలంటే ఏం చేయాలంటే.. మీ భాగస్వామితో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయండి. జీవితంలో సాధించబోయే అంశాలు.. ఆర్థిక పరమైన విషయాలన్నీ చర్చించినా.. కొంతమేరకే వాటిని పరిమితం చేయండి. 
 
పెద్దల కుదిర్చిన వివాహమైనా, లవ్ మ్యారేజ్ అయినా భాగస్వాములు ఒకరికొకరు తోడుగా.. ఎలాంటి భయాలకు లోనుకాకుండా ఉండాలి. రూమ్‌ల ఎంపిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కెమెరాలు వంటివి లేకుండా చూసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి