మనిషి తను కోరుకున్న వారిని ప్రేమిస్తుంటాడు. ఆ ప్రేమ కోసం పడే పాట్లు అన్నీఇన్నీ కావు. అప్పుడు చాలా ఒత్తిడికి (టెన్షన్) గురవుతుంటారు. అలాగే ప్రేమను పొందిన తర్వాత కూడా ఒత్తిడికి లోనవుతుంటారు. ఓ ప్రముఖ వ్యక్తి చెప్పినట్లు ప్రేమ టెన్షన్‌ను పుట్టిస్తే, ఆ టెన్షన్‌ను దూరం చేసేది రతిక్రియ అని ఆయన తెలిపారు.
ఈ విషయంలో మన దేశం ఎటువైపు?
రతిక్రియకు వాడే కండోమ్‌లను తయారు చేసే ప్రముఖ కంపెనీ భారతదేశంలో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు పది పెద్ద నగరాల్లో నివశించేవారు మూడు వేలమంది పాల్గొన్నారు. ఇందులో తెలిసిన అంశాలు ఏంటంటే... 40 శాతంకు పైగా ప్రజలు వారి వివాహానికి ముందు రతిక్రియలో పాల్గొన్నట్టు వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఇంగ్లీషులో సామెత ఒకటి ఉంది. రహస్యం గురించి, మనోవిజ్ఞానం గురించి తెలిసినవారు దీనిని నమ్మరు. పెండ్లి అనేది ఓ లడ్డు లాంటిది. దీనిని తినేవారు, తిననివారు కూడా బాధపడుతుంటారు. తెలివైన వారు ఇలాంటి సామెతలపై నమ్మకాలుంచుకుంటారు.
ప్రేమ అనేది ఒక జబ్బులాంటిది...
ప్రేమ అనేది ఒక జబ్బులాంటిదని కొంతమంది డాక్టర్ల పరిశోధనల్లో తేలింది. ఈ జబ్బుకు మందు అనేది కేవలం రత్రిక్రియ మాత్రమేనని వారి పరిశోధనల్లో వెల్లడైనట్టు చెపుతున్నారు. సరైన ప్రేమ లభించకపోతే శరీరంలో జబ్బులు అధికమవుతాయని, దీంతో కోపం, ఇతర మానసిక జబ్బులు పుట్టుకొస్తాయని వారు పేర్కొన్నారు. దీనిని లవ్ సిక్‌నెస్ అంటారని వారు తెలిపారు.