పుట్టిన నెలలను బట్టి.. లవ్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పొచ్చు..?
బుధవారం, 26 డిశెంబరు 2018 (11:04 IST)
నేటి తరుణంలో ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రేమించటం మంచిదే కానీ, అది ఇతరులకు సమస్యలు తెచ్చి పెట్టే విధంగా ఉండకూడదని పండితులు చెప్తున్నారు. అందువలన ప్రతీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇది ఇలా ఉంటే.. మీరు పుట్టిన నెలలు బట్టి మీ ప్రేమి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఏ నెల వారికి ఎలా ఉంటుందో మీరే చూడండి.
జనవరి:
జనవరిలో పుట్టినవారు సహజంగా ఇండిపెండెంట్‌గా ఉంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వీళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. ఎదుటి వారి తప్పులను, బలహీనతలను చూడరు. చాలా నిజాయితీగా ప్రేమిస్తారు.
ఫిబ్రవరి:
ఫిబ్రవరిలో పుట్టినవాళ్లు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు. అయితే అందరితో కలవలేని బిడియం ఉంటుంది. నిజాయితీగా, గౌరవంగా ఉంటారు. చాలా రొమాంటిక్‌గా ఉంటారు.
మార్చి:
మార్చి నెలలో పుట్టినవాళ్లు.. ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు. సిగ్గు ఎక్కువ.. ప్రేమ కలిగి ఉంటారు. కాస్త నిర్మొహమాటం ఎక్కువ. చాలా నిజాయితీగా ఉంటారు.
ఏప్రిల్:
ఏప్రిల్‌లో నెలలో పుట్టినవారు.. డైనమిక్ అండ్ యాక్టివ్‌గా ఉంటారు. వీళ్లు చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు. వాళ్ల సమస్యలను పరిష్కరించుకోవడానికి స్నేహితులు కావాలి.
మే:
మే నెలలో పుట్టిన వారు.. వాళ్ల సొంత నిర్ణయానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మ్యూజిషియన్స్, యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కష్టపడతారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎక్కువమంది పిల్లలు ఉండటాన్ని ఇష్టపడరు.
జూన్:
జూన్ నెలలో పుట్టిన వాళ్లు చాలా అసూయ కలిగి ఉంటారు. కానీ చాలా రొమాంటిక్‌గా ఉంటారు. వీరు మంచి లవర్స్, చాలా సాన్నిహిత్యంగా ఉంటారు.
జూలై:
జూలైలో పుట్టిన వాళ్లు చాలా జాలిగా ఉంటారు. నిజాయితీగా ఉంటారు. వాళ్ల రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు. వీళ్లను అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి హర్ట్ అయ్యారంటే.. రికవర్ అవడానికి సమయం పడుతుంది.
ఆగస్ట్:
ఆగస్ట్ నెలలో పుట్టినవారు.. సమాజానికి మూల స్తంభాల్లాంటి వారు. ఇతరులను ప్రోత్సహిస్తారు. తేలికగా డబ్బు సంపాదిస్తారు. చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటారు. అలాగే రొమాంటిక్, కేరింగ్, లవింగ్‌గా ఉంటారు.
సెప్టెంబర్:
సెప్టెంబర్ నెలలో పుట్టినవాళ్లు చాలా తెలివైనవాళ్లు. వీళ్లు పెద్ద వీక్‌నెస్ డిప్రెషన్. వీళ్లు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. చాలా నిజాయితీగా, సెన్సిటివ్‌గా, నాలెడ్జ్ కలిగి ఉంటారు. సీక్రెట్స్ దాచుకుంటారు. ఫీలింగ్స్‌ని చెప్పరు.
అక్టోబర్:
అక్టోబర్ నెలలో పుట్టినవాళ్లు చాలా లక్కీ పర్సన్స్. లక్ష్యాలను సాధిస్తారు. చాలా ఎమోషనల్‌గా ఉంటారు. ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తారు, ఇష్టపడతారు.. అలాగే వాళ్లు నుంచి కూడా అదే కోరుకుంటారు. కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు.
నవంబర్:
నవంబర్ నెలలో పుట్టినవాళ్లు అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ ఫీలై.. ఒత్తిడికి గురవుతారు. వీళ్లు చాలా తెలివైనవాళ్లు, చాలా షార్ప్‌గా ఆలోచిస్తారు. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. చాలా రొమాంటిక్‌గా ఉంటారు.
డిసెంబర్:
డిసెంబర్ నెలలో పుట్టినవాళ్లు ఫిలాసఫర్స్ అవుతారు. చాలా తేలికగా లక్, వెల్త్ పొందుతారు. ఓర్పు తక్కువ. పొగడ్తలను ఇష్టపడతారు.