మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే....

"సుబ్బీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వంటి తమ్ముణ్ణియ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే మొగిలి పువ్వంటి మొగుణ్ణియ్యవే"
WD


కన్నెపిల్లలు ఈ పాటలు పాడుతూ.. గొబ్బెమ్మలకు పూజలు చేస్తారు. ఈ పాట నేటికీ సాంప్రదాయంగా కన్నెపిల్లల నోటిలో రాగాలు పోతూనే ఉంది.
సంక్రాంతి, గొబ్బెమ్మల పూజకు చాలా దగ్గరి సంబంధముందన్న విషయం మనకందరికీ తెలిసిందే.

ముఖ్యంగా సంక్రాంతి పల్లెవాసులకు ఎక్కువ ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయంలో ధాన్యలక్ష్మిని ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో స్వాగతం పలుకుతారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ముగ్గుల్లో గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరించి పాటలు పాడుతారు.

సంక్రాంతికి ముందే పుట్టిన ధనుర్మాసంలో ఇంటి ముంగిట అందమైన ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలను అలంకరించుకోవడం వంటివి పల్లెప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. చివరిరోజైన సంక్రాంతికి కన్నెపిల్లలు, చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి ఇంటిముంగిటను రంగు రంగుల వల్లికలతో అలంకరించి పండుగ చేసుకుంటారు.