సంక్రాంతి రోజున స్నానం-దానం-పూజ తప్పనిసరి.. దానంగా ఏమివ్వాలి?

శుక్రవారం, 13 జనవరి 2017 (15:03 IST)
ఉత్తరాయణ పుణ్య కాలం ఉత్తమ లోక ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకే మహాభారత కాలంలో భీష్ముడు, కురుక్షేత్ర సంగ్రామంలో నేలకూలినా.. ఉత్తరాయన పుణ్యకాలం కోసం ప్రాణాలు బిగబట్టుకుని.. ఆ రోజున స్వర్గస్తుడైనాడు. ఇక సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని స్మరించి పూజ చేస్తే  సకల సంపదలు లభిస్తాయి. అందుకే సంక్రాంతి రోజున స్నానం, దానం, పూజ అనే మూడు విధులను తప్పకుండా నిర్వర్తించాలి. 
 
సూర్యోదయానికి ముందే నువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలంటు స్నానం చేయాలి. జాతకంలో శని వల్లే కష్టాలు కలుగుతాయి. అందుకే ఆ రోజున నువ్వులు దానం ఇవ్వాలి. సంక్రాంతి రోజున బ్రాహ్మణుడిని ఇంటికి పిలిపించి నువ్వులు, బెల్లము దక్షిణ ఇస్తారు. దీనివల్ల ఆరోగ్యం ధన సంపదలు అభివృద్ధి చెందుతాయి. 
 
స్త్రీలు దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం పసుపు, కుంకుమలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు, వస్త్రాలు మొదలైనవి దానం ఇవ్వాలని పురాణాలు చెప్తున్నాయి. ఇలా సంక్రాంతి రోజున చేసే దానాల వలన సకల పీడలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి