గ్లోబలైజేషన్ అంటే.. దేశాలను తాకట్టు పెట్టడమేనా..?

File
FILE
సోము: ఒరేయ్ రామూ.. గ్లోబలైజేషన్ అంటే ఏంటిరా..?

రాము: ఆ.. ఏముందిరా...! మొన్న ఒబామా భారత్‌కు వచ్చాడా.. నిన్న కామెరూన్ చైనా వెళ్లాడా.. నేడు మన్మోహన్ సింగ్ దక్షిణ కొరియా వెళ్తున్నాడా...!

సోము: అంటే దేశాలు తిరగడమా రా.. రామూ...!

రాము: అది కాదురా మట్టిబుర్రా..! ఒబామా వచ్చి మన ఉద్యోగాలను వాళ్ల దేశానికి తీసుకు వెళ్లాడా.., మరి కామెరూన్ ఏమో.. తమ దేశంలోని వస్తువులను చైనాలో అమ్ముకోవడానికి కాంట్రాక్టు కుదుర్చుకున్నాడా.., అలాగే మన ప్రధాని కూడా దక్షియా కొరియా పెట్టుబడులను భారత్‌కు తీసుకురావడానికి వెళ్తున్నాడు కదా..!

సోము: ఓహో... ఇప్పుడు అర్థమైందిరా.. పూర్వం వస్తు మార్పిడి అనే పద్ధతి ఉండేది అదే కదా..! అదేనా..!

రాము: హా... ఇంచు మించు అలాంటిదే రా.. సోమూ..!

సోము: అప్పుడు వస్తువులు తాకట్టు పెట్టుకునే వాళ్లం ఇప్పుడు దేశాలు తాకట్టు పెట్టుకుంటున్నాం అన్నమాట. బావుందిరా.. గ్లోబలైజేషన్.

వెబ్దునియా పై చదవండి