కాంగ్రెస్ అధిష్టానంతో అంత సన్నిహితమా?

బుధవారం, 21 మే 2008 (08:43 IST)
వార్తః ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రానికి వైఎస్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించనున్నట్టు తనకు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని తెరాస చీఫ్ కేసీఆర్ తెలిపారు.

చెవాకుః మీరు చెప్పింది నిజమా? ఎవరి ద్వారా మీకీ విషయం తెలిసింది? ఏకంగా ఢిల్లీ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారంటే ఆ పార్టీ అధిష్టానంతో మీకేదో సంబంధం ఉంటుందనుకుంటున్నాం. అయినా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శతృవులు ఉండరు కదా. ఇంతకీ మీ మాటలు వింటుంటే మీకు తెలంగాణా కన్నా ముఖ్యమంత్రి పీఠంపైనే దృష్టి ఉన్నట్టు కనబడుతోంది. అందుకేనేమో దానికి అడ్డుతగులుతారని భావిస్తున్న వైఎస్, చంద్రబాబు... చివరకు చంద్రబాబులపై విరుచుకు పడుతున్నారమోనని పిస్తోంది.

వెబ్దునియా పై చదవండి