మీరూ ఆ దృష్టితోనే ఉన్నారేమో?

వార్తః ముఖ్యమంత్రి పదవి దక్కకుంటే వైఎస్ ప్రత్యేక రాయలసీమ కోరేవాడు కారా అని తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి ఆరోపించారు. రెండు నెలల్లో తెలంగాణా తెస్తామనే వారినే గెలిపించండి. భవిష్యత్తులో అవసరమైతే సొంత పార్టీ కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు.

చెవాకుః మీరూ దానికోసమే ప్రత్యేక తెలంగాణా కోరుతున్నారేమో! 2004లో కాంగ్రెస్ గెలిచిన సందర్భంగా ముఖ్యమంత్రి కావాలని మీరూ అభిలషించారుగా. అది రాకపోయేసరికి అవకాశం కోసం చూస్తున్నారేమోననిపిస్తోంది. పంతాలతో మీ ప్రాంతంలోని నలుగురు సీనియర్ నేతలనే దారికి తెచ్చుకోలేని మీకే ముఖ్యమంత్రి పదవిపై అంత మోజుంటే వైఎస్‌కు ఉండటంలో తప్పేమీ లేదుగా. మీ స్థాయిని మీరు తెలంగాణకు పరిమితం చేసుకున్నట్టు వైఎస్ ఆయన స్థాయిని రాయలసీమకు ఎందుకు పరిమితం చేసుకుంటారు? నిజంగానే మీకు సామర్థ్యముంటే రెండు నెలల్లో తెలంగాణా సాధనకు కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తామని చెప్పి, మీ పార్టీ అభ్యర్థుల తరపున ఎందుకు ప్రచారం చేయలేదు. మీ వ్యవహార తీరు చూస్తుంటే పార్టీని గెలిపించే మాట అటుంచితే మీ వ్యాఖ్యలే ముంచేస్తాయోమోనని పిస్తోంది. మంచి చేయడం కష్టం కావచ్చు కానీ చేటు చేయడం చాలా సులభమేగా!

వెబ్దునియా పై చదవండి