అద్భుతదీపం కానీ దొరకలేదు కదా... ?

శుక్రవారం, 16 మే 2008 (15:48 IST)
వార్త : మేం అధికారంలోకి వస్తే రైతులకు 12 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాం. డ్వాక్రా మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తాం. నిరుద్యోగులకు రూ. 1000 భృతిగా ఇస్తాం. వృద్ధులకు, వికలాంగులకు రూ. 500 వంతున ఫించన్లు ఇస్తాం. ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు.

చెవాకు : ఇంతకు ముందు ఉచితం సముచితం కాదని చెప్పిన తమరు ఇప్పుడేమో అందరికీ అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటున్నారు కొంపదీసి మీకు అల్లావుద్ధీన్ అద్భుతదీపం లాంటిది ఏదైనా దొరికిందా నాయుడు గారూ.

వెబ్దునియా పై చదవండి