అధికారం ఎలాగూ రాదు...కాస్త ఆగొచ్చుగా.

గురువారం, 22 మే 2008 (14:08 IST)
వార్తః ఉప ఎన్నికల్లో తెరాసకు మద్దతు ప్రకటించిన క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్

చెవాకుః వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తామని చెప్పిన మీరు ఏ ఒక్క సీటు ఆశించకనే తెరాసకు మద్దతు ప్రకటించడమేంటి? ఇలా ఇస్తే ఆ పార్టీ మిమ్మల్ని బలహీనులుగా భావించదా? ఫర్వాలేదులే అనుకుంటున్నారా? తెలంగాణాలో ఎటూ మీరు అధికారంలోకి రాలేరు. ఇక తెలంగాణాకు మద్దతు పలకడం ద్వారా కోస్తాలో సరిగ్గా ఉంటుందన్నది సందేహమే. ఈ ఎన్నికల్లో ఎలాగూ పోటీ చేయడం లేదు కదా. కొంత కాలం ఆగితే మిమ్మల్ని గౌరవించే పార్టీ వస్తుంది. అపుడు ఇస్తే సరిపోతుంది. అయినా మీ పార్టీ...అంతా మీ ఇష్టమేగా.

వెబ్దునియా పై చదవండి