వార్తః మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన మీకోసం యాత్ర సందర్భంగా ప్రజలకిచ్చిన హామీలు అమలయ్యేంతవరకు నిద్రపోనని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు వాగ్ధానం చేశారు.
చెవాకుః బాగానే చెప్పారు బాబు గారూ! అయితే పార్టీని నమ్ముకుని శ్రమిస్తున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందిగా. ప్రజలకు మేలు చేయడమంటే కార్యకర్తలకు అన్యాయం చేయడమే కదా! లాభం లేనిదే పార్టీకి సేవ చేసేందుకు ఎవరూ ముందుకు రారు కదా! అందులో మీరిచ్చే హామీలన్నీ పింఛన్లు, ఇళ్లు వంటివే. భారీ ప్రాజెక్టుల వంటివైనా అంతో ఇంతో మేలుంటుంది. మీరూ బాగా ఆలోచించే ఉంటారు. కానీ కార్యకర్తలకు ఎలా న్యాయం చేస్తారో మాకే అర్థం కాలేదు.