వార్తః ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికల్లో ముషీరాబాద్‌లో మాత్రమే పోటీ చేస్తున్న తాము మిగిలిన నియోజకవర్గాల్లో తెరాస సహా ఎవరికీ మద్దతు ఇవ్వబోమని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అంటున్నారు.
చెవాకుః మీ మద్దతు కావాలని ఎవరూ అడిగినట్టు లేరే. అయినా ఎందుకు ఇంత ఆవేశం. ఎవరి బలాన్ని నమ్ముకుని వారు బరిలో దిగితే మీరు భుజాలు తడుముకుంటున్నారెందుకు. ఒకవేళ వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో! ఆ లోపు ఎన్నో మార్పులు జరగొచ్చు. మీరు ఇపుడు తిట్టిన వారినే భుజాలకెత్తుకోవాల్సి రావచ్చు. కాబట్టి పోటీ చేయని స్థానాల్లో మద్దతుకు సంబంధించిన విషయం మాట్లాడక పోవడమే ఉభయతారకంగా ఉంటుంది.