ఏమైనా మీకు మా దొడ్డ మనసండీ రెడ్డి గారు... !

గురువారం, 15 మే 2008 (14:05 IST)
వార్త : మేం పెద్ద పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. కానీ మేము పెద్దలతో పాటు పేదలకు మేలు చేస్తున్నాం. అంతెందుకు ప్రతిపక్షనేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు సైతం రూ. 78 లక్షల సబ్సిడీ ఇచ్చాం. పునరంకిత సభలో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి.

చెవాకు : అధికారం సాధించాక ప్రజలకు మాత్రమే సేవ చేస్తామని అన్ని పార్టీలు చెబుతుంటాయి. కానీ మీరు ప్రతిపక్షాలకు సైతం మేలు చేస్తున్నామని చెప్పారు (చెబుతున్నారు). ఎమైనా మీది మా దొడ్డ మనసండీ రెడ్డిగారు.

వెబ్దునియా పై చదవండి