నెగటివ్ రాజకీయం కూడా చేస్తున్నారా?

వార్తః ఖైరతాబాద్‌లో పోటీకోసం లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ్‌ను తానే ఒప్పించానని తెరాస చీఫ్ కేసీఆర్ ప్రకటించారు.

చెవాకుః అంటే ఆ పార్టీతో రహస్య అవగాహన కుదుర్చుకున్నారన్న మాట. అయినా సరే కానీ మీ రక్కడ గెలవాలనుకుంటున్నారా లేక మరెవర్నైనా గెలిపించాలనుకుంటున్నారా. లేకుంటే పీజేఆర్‌పై ప్రజల్లో ఉన్న సానుభూతితో మీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంతటా విన్పిస్తున్న తరుణంలో ఆ పార్టీ వ్యతిరేక ఓట్లను పంచుకోవడమేంటి? లేక టీడీపీ చెబుతున్నట్టు కాంగ్రెస్‌తో కూడా మీకేమైనా రహస్య అవగాహన ఉందా? ఏంటో ఈ నెగటివ్ రాజకీయాలు.

వెబ్దునియా పై చదవండి