నొప్పింపక, తానొవ్వక తిరుగువాడు...

వార్తః ఉప ఎన్నికల్లో ప్రచారానికి ఎమ్మెస్ మినహా తెలంగాణా సీనియర్ నేతలందరూ దూరంగా ఉన్నారు. మేడారంలో వెంకటస్వామి ముఖ్యమంత్రిపై వాగ్బాణాలు సంధిస్తూనే ప్రచారం జరుపుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్, పీసీసీ చీఫ్‌ డీఎస్‌లు ఎంతగానో నచ్చచెప్పినా వారి వైఖరిలో మార్పులేదు.

చెవాకుః ఎంత చెప్పినా నియోజకవర్గంలో వారి మాట విని ఓటేసే వారు లేదనే విషయాన్ని ఈ నేతల ద్వారానే చెప్పించాలనుకుంటున్నారేమో. అది జరగదు. భవిష్యత్ అవసరాలు ఏ పార్టీతో ఎలా ఉంటాయో ఏమో ఎవరు చూశారు? ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లకుంటేనేం... పార్టీలో ఎన్నో ఉపయోగం లేని పనులున్నాయిగా. దానిని ఇప్పిస్తే వారు కాదంటారా?

వెబ్దునియా పై చదవండి