వార్తః రెండు రూపాయల కేజీ బియ్యం పథకాన్ని అర్హులకు మాత్రమే అందేలా బోగస్ కార్డుల ఏరివేత ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం ప్రారంభించిన మొదటి నెలలో లక్షలాది తెల్లకార్డులకు బియ్యం తీసుకోనందున ఆ కార్డులపై ప్రధానంగా దృష్టి సారించాలని భావిస్తున్నారు.
చెవాకుః అది అంత తేలిగ్గా సాధ్యం కాగలదనుకుంటున్నారా? బోగస్ ఓటర్ల పేరు తొలగించడం కన్నా ఇది మరీ కష్టమని తెలిసి కూడా ఎందుకు ఈ సాహసం చేస్తున్నారు? ఇంతకీ మీ కింది స్థాయి అధికారులైనా దీనికి సాహసిస్తారా? వారి ప్రమేయం లేకుండా బోగస్ కార్డులు ఎలా వచ్చాయనుకుంటున్నారు? బోగస్ కార్డులు తొలగించాలనుకుంటే అధికారుల నుంచి రాజకీయ నేతల వరకు, కార్డు దారుల నుంచి డీలర్ల వరకు ఎందరి అభ్యంతరాలనో దాటాల్సి ఉంటుంది. దీనికి మీరు సిద్ధపడినా మీ కింది స్థాయి అధికారుల ద్వారా ఈ ప్రక్రియ నిజాయతీగా అమలు జరుగుతుందన్నది అనుమానంగానే ఉంది.