మీరు రాజకీయాల్లో ఉండాల్సినవారు కాదండీ రావు గారు... ?
శనివారం, 17 మే 2008 (11:40 IST)
వార్త : ముఖ్యమంత్రి వైఎస్ ఆయన సహచరుడు కేవీపీ రామచంద్రరావు కలిసి ఈ నాలుగేళ్లలో 40 వేల కోట్ల రూపాలయలు దండుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ స్వాహా చేశారు. ఇంకా ఎక్కడ భూములు మిగిలి ఉన్నాయా అని కేవీపీ ఆధ్వర్యంలో రెవిన్యూ మాజీ అధికారితో కలిసి భూముల కోసం సర్వే చేస్తున్నారు... టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు.
చెవాకు : వాళ్లు దండుకున్న డబ్బుల వివరాలు, భూములను అమ్మేయడం కోసం వారు సర్వే నిర్వహిస్తున్న సంగతులు చూసోచ్చినట్టు మరీ చెబుతున్నారంటే మీరు నిజంగా ఏ డిటెక్టివ్ సంస్థలోనో ఉండాల్సినవారండీ రావు గారు. అందుకే మీరు రాజకీయాల్లో ఉండాల్సిన వారు కాదండీ రావు గారు.