అమ్మకపు ఒత్తిడి: తిరోగమనంలో సెన్సెక్స్

ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ఒక్కసారిగా సెన్సెక్స్ నష్టాలను చవిచూసింది. దీంతో సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో, 17,180 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఒక పాయింట్ స్వల్ప నష్టంతో 5, 120 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

రియాల్టీ, బ్యాంకింగ్, ఆటో వాటాల కొనుగోళ్లు లాభదాయకంగా కొనసాగుతుండగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, క్యాపిటల్ గూడ్స్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. ఈ కారణంగానే బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది.

ఇకపోతే.. టాటామోటార్స్ లాభపడిన కంపెనీల్లో అగ్రస్థానంలో ఉండగా, రిలయన్స్ ఇన్‌ఫ్రా నష్టాలను చవిచూసిన కంపెనీలలో టాప్‌లో నిలిచింది.

వెబ్దునియా పై చదవండి