కోలుకోని స్టాక్ మార్కెట్లు : ఏడోరోజూ నష్టాలే.. సూచీలు డౌన్!

గురువారం, 1 ఆగస్టు 2013 (18:10 IST)
FILE
భారత స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పడంలేదు. వరుసగా ఏడోరోజూ నష్టాల బాటలోనే పయనించాయి. గురువారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు నష్టపోయి 19,317 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయి 5725 వద్ద ముగిసింది.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, హిందూస్తాన్ యూని‌లీవర్, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లు లాభాలు ఆర్జించగా.. బీహెచ్ఈఎల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, హిండాల్కో షేర్లు నష్టాలు చవిచూశాయి.

రూపాయిని బలోపేతం చేసేందుకు ఆర్‌బీఐ తీసుకున్న ఉద్ధీపన చర్యలు, నూతన ద్రవ్యపరపతి విధానం స్టాక్ మార్కెట్ల పాలిట వ్యతిరేకంగా పరిణమించాయి.

వెబ్దునియా పై చదవండి