ఫిబ్రవరి 3న ఎన్టీపీసీ.. ఎఫ్‌పీఓ ప్రారంభం..?

ప్రభుత్వరంగ ఎన్టీపీసీ మలి విడత ఇష్యూ (ఎఫ్‌పీఓ) ఫిబ్రవరి 3-5వ తేదీల మధ్య ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఇష్యూలో ఒక్కో షేర్ ధరను 240-250 రూపాయిలుగా నిర్ణయించేందుకు రంగి సిద్ధమవుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం 30, 644 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్తు సంస్థగా ఉన్న ఎన్టీపీసీ, 2017 నాటికి 75,000 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ కంపెనీగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది.

ఈ నేపథ్యంలో.. ఎన్టీపీసీలో ప్రభుత్వానికి 89.5శాతం వాటా ఉండగా, ఎఫ్‌పీఓ ద్వారా ఐదు శాతం వాటాను విక్రయించనుంది. ఎన్టీపీసీ షేరు శుక్రవారం నాడు ఎన్ఎస్ఇలో 231.20 రూపాయల వద్ద ముగిసింది. ఎఫ్‌పిఒ ధర ప్రస్తుత షేరు కంటే అధికంగా ఉండటంతో శుక్రవారం మార్కెట్ పతనమైనప్పటికీ ఎన్టీపీసీ షేర్ లాభపడింది.

వెబ్దునియా పై చదవండి