మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 46 పాయింట్లు పుంజుకుని, 17, 244 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్ల స్వల్ప లాభంతో 5, 139 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

విదేశీ మార్కెట్ల ప్రభావం, దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం వంటి కారణాలతో పురోగమనంలో పయనించిన సెన్సెక్స్, బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది. విదేశీ మార్కెట్ల ఆశాజనక సంకేతాలు, స్వదేశీ వాటాల కొనుగోళ్లు, ట్రేడింగ్ ఊపందుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ మార్కెట్ తిరిగి లాభాలను నమోదు చేసుకుంటోంది.

ఇకపోతే.. రియాల్టీ, బ్యాంక్, ఆటో, ఆయిల్, గ్యాస్, హెల్త్‌కేర్, మెటల్ వాటాల కొనుగోళ్ల పుంజుకోగా, ఐటీ ఎఫ్ఎమ్‌సీజీ, పవర్, క్యాపిటల్ గూడ్స్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి