మిశ్రమ ఫలితాల్లో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు

బుధవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు యూరప్, ఆసియా మార్కెట్లు లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

అలాగే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 3.30 గంటల ప్రాంతంలో 28 పాయింట్ల నష్టంతో 17,169 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. కానీ నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కేవలం ఒక్క పాయింట్ స్వల్ప లాభంతో, 5,123 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ ఒకే పాయింట్ లాభంతో 5,313 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ -0.36 పాయింట్ల నష్టంతో 5,776 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

అయితే ఆసియా మార్కెట్లు బుధవారం లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 36 పాయింట్లు పుంజుకుని 9,608 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే హాంగ్ షెంగ్ 176 పాయింట్లు వృద్ధి చెంది, 22,289 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిశాయి. డౌ సూచీ మాత్రం 126 పాయింట్లు బలపడి, 10,471 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని ముగించింది.

వెబ్దునియా పై చదవండి