మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ మార్కెట్‌

బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో కొనసాగిన బాంబే స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నానికి తిరోగమనం వైపు పయనించింది. కానీ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంది.

దీంతో సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,170 పాయింట్ల వద్ద పయనిస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం మూడు పాయింట్ల స్వల్ప లాభంతో 5,125 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

విదేశీ మార్కెట్లు సైతం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం, దేశీయ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురవడం సెన్సెక్స్ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడానికి ప్రధాన కారణమని బాంబే స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి