మిశ్రమ ఫలితాల్లో విదేశీ స్టాక్ మార్కెట్లు

బుధవారం అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. ఇందులో అమెరికా మార్కెట్ మాత్రమే లాభాలను నమోదు చేసుకోగా, యూరప్, ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను చవిచూశాయి. ఫలితంగా బుధవారం సాయంత్రం 5.00 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ మార్కెట్లు హెచ్చుతగ్గులతో ర్యాలీని కొనసాగిస్తున్నాయి.

ఇందులో భాగంగా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 45 పాయింట్లు పుంజుకుని, 17,098 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం 14 పాయింట్లు వృద్ధి చెంది, 5,116 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఇదేవిధంగా.. అమెరికా స్టాక్ మార్కెట్ కూడా ఆశాజనకంగా కొనసాగుతోంది. ఇందులో డౌ సూచీ 11 పాయింట్లు బలపడి, 10,564 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.

మరోవైపు.. ఆసియా మార్కెట్ సూచీల్లో నికాయ్ కేవలం 3 పాయింట్లు క్షీణించి, 10,563 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోండగా, హాంగ్‌షెంగ్ +0.74 పాయింట్ల కనిష్ట వృద్ధితో, 21,208 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

ఇకపోతే... యూరప్ స్టాక్ మార్కెట్లు కూడా మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. ఇందులో ఎఫ్‌టీఎస్ఈ సూచీ -0.60 పాయింట్లు కనిష్ఠంగా క్షీణించి, 5,601 పాయింట్ల మార్కును తాకింది. అలాగే డాక్స్ సూచీ కూడా ఆరు పాయింట్ల స్పల్ప లాభంతో, 5,892 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి