రెడ్ మార్కులో సెన్సెక్స్: నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు పుంజుకుని 16,471 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 4,890 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.17 శాతం, నిఫ్టీ 0.18 శాతం మేరకు క్షీణించాయి.

బీఎస్ఈ చమురు మరియు సహజవాయువు, మెటల్ ఇండెక్స్‌లు ఒక శాతం మేరకు వృద్ధి చెందాయి. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఏసీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రెల్ ఇన్‌ఫ్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిం తదితర సంస్థల వాటాలు లాభాల్లో ఉండగా.. మారుతీ ఇండస్ట్రీస్, హీరో హోండా, జేపీ అసోసియేట్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర సంస్థల వాటాలు నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 2,485 వాటాలు ట్రేడ్ అవగా, 1,412 వాటాలు లాభపడ్డాయి. అలాగే 991 వాటాలు నష్టాల్లో ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి