లాభాలతో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు

శుక్రవారం విదేశీ స్టాక్ మార్కెట్లకు కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను చవిచూసిన అంతర్జాతీయ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం 3.30 గంటల ప్రాంతంలో లాభాలను నమోదు చేసుకున్నాయి.

కానీ దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 81 పాయింట్లు క్షీణించి, 17,534 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్లు పతనమై, 5,246 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 8 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని, 5,535 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ 18 పాయింట్ల స్వల్ప వృద్ధితో, 6,0377 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

ఇదేవిధంగా ఆసియా మార్కెట్లు శుక్రవారం లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ కూడా 116 పాయింట్లు పుంజుకుని, 10,798 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే హాంగ్ షెంగ్ 27 పాయింట్లు వృద్ధి చెంది, 22,296 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు కూడా గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిశాయి. దీంతో డౌ సూచీ 33 పాయింట్లు లాభపడి, 10,606 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని ముగించింది.

వెబ్దునియా పై చదవండి