వారాంతం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

FILE
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ మార్కెట్.. లాభనష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

కానీ ట్రేడింగ్ ముగిసే సమయానికి బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, 75 పాయింట్లు క్షీణించి, 17,509 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,244 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.

విదేశీ మార్కెట్లు ఆశాజనకంగా కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో సెన్సెక్స్ పతనమైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇంకా ఐటీ రంగానికి చెందిన వాటాల ట్రేడింగ్ పడిపోవడంతో స్టాక్ మార్కెట్ తిరోగమనంలో పయనించింది. అంతేగాకుండా.. మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడం సెన్సెక్స్ క్షీణించేందుకు ప్రధాన కారణమైందని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే.. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ, విప్రో, భారతి ఎయిర్‌టెల్, హిందాల్కో, స్టెర్లిట్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూడగా, డీఎల్ఎఫ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ పార్మా, జై ప్రకాష్ అసోసియేట్స్ వంటి సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి