వారాంతం స్టాక్ మార్కెట్లు ఎలా ముగిశాయంటే..?

FILE
వారాంతమైన శుక్రవారం దేశీయ, విదేశీ సూచీలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ క్షీణత, వాటాల అమ్మకాల ఒత్తిడి వంటి పలు కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటల వద్ద అమెరికా సూచీలైన డోజోన్స్ 28 పాయింట్ల నష్టంతో 10, 578 పాయింట్లను నమోదు చేసుకుంది. అలాగే బ్రిటన్ స్టాక్ మార్కెట్ సూచీ అయిన ఎఫ్‌టీఎస్ఈ 100 0.35 పాయింట్లు క్షీణించి, 5,526 పాయింట్ల మార్కును తాకింది.

ఇకపోతే చైనా స్టాక్ మార్కెట్ సూచీ షాంఘై కూడా తిరోగమనంలో పయనించింది. దీంతో 31 పాయింట్ల మేర పతనమై, 3,161 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. కానీ జపాన్ స్టాక్ మార్కెట్ సూచీ నికాయ్ మాత్రం 116 పాయింట్లు బలపడి 10, 798 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదిలా ఉంటే.. వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు కూడా నష్టాలతోనే ముగిశాయి. ఇందులో భాగంగా శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 పాయింట్లు పతనమై, 17,540 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల నష్టంతో, 5,244 పాయింట్ల వద్ద ముగిసింది.

వెబ్దునియా పై చదవండి