స్టాక్ మార్కెట్: తిరోగమనం వైపు సెన్సెక్స్, నిఫ్టీ ర్యాలీ

బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు కొనసాగుతోంది. దేశీయ వాటాల ట్రేడింగ్ మందకొడిగా సాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. తద్వారా సెన్సెక్స్ సూచీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 186 పాయింట్లు పతనమై 16,979 పాయింట్ల దిగువ స్థాయికి పడిపోయింది. అలాగే నిఫ్టీ కూడా 72 పాయింట్లు కోల్పోయి, 5,080 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ నిరాశాజనకంగా కొనసాగడం ద్వారా బాంబే స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఇంకా మదుపుదారులు సైతం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపకపోవడం సెన్సెక్స్, నిఫ్టీల పతనానికి దారి తీసిందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి