స్టాక్ మార్కెట్ : 310 పాయింట్ల మేరకు లాభపడిన సెన్సెక్స్

మంగళవారం, 22 జులై 2014 (17:01 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో మంగళవారం నాటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ రికార్డు స్థాయిలో 310 పాయింట్ల మేరకు లాభపడి 26025 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ కూడా 84 పాయింట్ల మేరకు లాభపడి 7767 వద్ద ఆగింది. ఈ ట్రేడింగ్‌లో మెటల్, ఆయిల్, గ్యాస్, ఇన్ ఫ్రా, కన్స్యూమర్ డ్యురబుల్స్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. ఒక దశలో అంటే ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 26,050 గరిష్ట స్థాయిని, 25,780 కనిష్టస్థాయిని తాకగా, నిఫ్టీ 7,773 గరిష్టస్థాయిని, 7,704 కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. 
 
ఈ ట్రేడింగ్‌సో సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో భారతీ ఎయిర్ టెల్ అత్యధికంగా లాభపడగా, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌లు ఫైనాన్షియల్ టెక్నాలజీస్, వోక్ హార్డ్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్, ఒబెరాయ్ రియాల్టీ కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, థర్మాక్స్, టోరెంట్ పవర్, జేపీ ఇన్‌ఫ్రా‌ టెక్, ఐఆర్బీ ఇన్ ఫ్రా, సిండికేట్ బ్యాంక్, మారుతి సుజుకీ, లార్సెన్, పీఎన్‌బీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఎంఅండ్‌ఎం కంపెనీలను చవిచూశాయి. 

వెబ్దునియా పై చదవండి