భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు 16 నెలల తర్వాత నిఫ్టీ ఈ వారంలో భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 348 పాయింట్లు కోల్పోయి 25,024 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 7,460 వద్ద స్థిరపడ్డాయి.
కాగా, ఈ ట్రేడింగ్‌లో సన్ ఫార్మా ఇండియా, టీసీఎస్, రెడ్డీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనిలీవర్, విప్రో తదితర కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, బీహెచ్ఈఎల్, హిండాల్కో, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.