3 రోజుల సెలవు.. పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. కారణం అదే..?

మంగళవారం, 26 మే 2020 (10:08 IST)
భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. శని,ఆదివారాలకు తోడు రంజాన్ పండుగతో మూడు రోజుల సెలవు అనంతరం మొదలైన భారత స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాలతో ఆరంభమైంది. ఫలితంగా సెన్సెక్స్‌ 315 పాయింట్లు లాభంతో 30987 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 9140 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 
 
ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా ఆరంభంలోనే సెన్సెక్స్ 390 పాయింట్లు పెరిగి 31063 వద్ద, నిఫ్టీ 107 పాయింట్ల లాభంతో 9147 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. హిందాల్కో, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం వరకు లాభపడగా, ఐషర్‌ మోటర్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ సంస్థలు లాభాలను ఆర్జించాయి. అయితే బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హీరోమోటోకార్ప్‌, జీ లిమిటెడ్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు