నష్టాల్లో సెన్సెక్స్ .. స్వల్పంగా బంగారం ధరలు

శుక్రవారం, 20 మే 2016 (18:12 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభపడగా, లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగానూ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 
 
మరోవైపు.. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది. 

వెబ్దునియా పై చదవండి