బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ 325 పాయింట్ల మేరకు వృద్ధి చెందింది. అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీస్తుండటం, ముడి చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు.. వచ్చే బడ్జెట్ సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు సంకేతాలు రావడంతో భారతీయ స్టాక్ మార్కెట్ బుధవారం పరుగులు తీసింది. ఫలితంగా సరికొత్త రికార్డును నెలకొంది. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమాయనికి సెన్సెక్స్ సూచీ 325 పాయింట్లు పెరిగి 25,841 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 90 పాయింట్లు లాభపడి 7,725కి చేరుకుంది.
ఈ ట్రేడింగ్‌లో లాభపడిన కంపెనీల ధరల్లో అదానీ పోర్ట్స్, క్యాస్ట్రాల్ ఇండియా, ఎంసీఎక్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, వోక్ హార్డ్ లిమిటెడ్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, బెర్జర్ పెయింట్స్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్, జీఎంఆర్ ఇన్‌ఫ్రా, ఇంద్రప్రస్థ గ్యాస్ కంపెనీల షేర్లు తగ్గుముఖం పట్టాయి.