లాభాల బాటలో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

మంగళవారం, 31 మార్చి 2020 (16:38 IST)
అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో వరుస నష్టాలకు చెక్ పెట్టిన కీలక సూచీలు లాభాల బాట పట్టాయి. ఫలితంగా సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా ఎగిసింది, నిప్టీ కూడా 8600 పాయింట్లను టచ్ చేసినప్పటికీ ఆఖరి గంటలో లాభాల స్వీకరణ కనిపించింది. 
 
దీంతో సెన్సెక్స్ 1028 పాయింట్ల లాభంతో 29468 వద్ద, నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 8597 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరం చివరి ట్రేడింగులో సెన్సెక్స్ 29500 చేరువలో, నిఫ్టీ 86వేల పాయింట్ల చేరువలో ముగిసాయి. 
 
ఇకపోతే.. బీపీసీఎల్, గయిల్, బ్రిటానియా, ఓఎన్ జీసీ, హిందాల్కో, రిలయన్స్ , విప్రో, టెక్ మహీంద్ర, యూపీఎల్, ఐటీసీ లాభాలను గడించగా, ఇండస్ ఇండ్, బజాజ్ ఫినాన్స్, టైటన్, మారుతి సుజుకి,కోటక్ మహీంద్ర నష్టపోయాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు