మే నెలలో అతి పెద్ద ర్యాలీ నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు
బుధవారం, 27 మే 2020 (23:16 IST)
ఈరోజు బెంచిమార్కు సూచీలు, బ్యాంకింగ్ స్టాక్స్ ర్యాలీ నేపథ్యంలో 3% పైగా పెరిగాయి. ఎస్ & పి బిఎస్ఇ సెన్సెక్స్ 995.92 పాయింట్లు లేదా 3.25% పెరిగి 31605.22 వద్ద ముగిసింది. నిఫ్టీ 285.90 పాయింట్లు లేదా 3.71% పెరిగి 9374.95 వద్ద ముగిసింది మరియు నిఫ్టీ-50 సూచీ 9300 జోన్లను తిరిగి పొందింది.
సుమారు 939 షేర్లు తమ విలువలో క్షీణతను నమోదు చేయగా, 1363 షేర్లు ముందుకు సాగాయి మరియు 163 షేర్లు విలువ మారలేదు. అన్ని రంగాలలో, ఫార్మా ఇండెక్స్ స్వల్పంగా ముగియగా, నిఫ్టీ బ్యాంక్ పైకి ఎగబాకింది, తరువాతి వరుసలో, ఐటి, మెటల్ మరియు ఎనర్జీ స్పేస్ లు ఉన్నాయి. టాప్ సెన్సెక్స్ లాభాలు పొందినవాటిలో, యాక్సిస్ బ్యాంక్ (7%), ఐసిఐసిఐ బ్యాంక్ (5%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (5.58%), బజాజ్ ఫైనాన్స్ (5.84%) ఉన్నాయి.
4వ త్రైమాస ఆదాయాలు
డాబర్ ఇండియా నికర లాభం నిరుడు రూ. 370 కోట్లుకాగా, అది ఇప్పుడు 24% తగ్గి 281.2 కోట్ల రూపాయలకు చేరుకుంది. అలాగే నిరుడు దీని ఆదాయం 2128.2 కోట్ల రూపాయలు కాగా అది ఇప్పుడు 12.4% తగ్గి రూ. 2185.2 కోట్లగా ఉంది.
2020 మార్చితో ముగిసిన త్రైమాసికంలో, సన్ ఫార్మా 399.8 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. ఇదే కాలవ్యవధిలో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 635.9 కోట్లు ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలంవ్యవధిలో సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఆదాయం రూ .7163.92 కోట్లు ఉండగా, ఇప్పుడు అది రూ. 8164.9 కోట్లకు చేరుకుంది.
కెపిఐటి టెక్నాలజీస్ తమ నిరుడు ఏకీకృత నికర లాభం రూ. 40.9 కోట్లకు ప్రతిగా లో రూ. 38.1 కోట్ల రూపాయలను సాధించి 7% పతనాన్ని చవిచూసింది. మరియు కంపెనీ ఆదాయం నిరుడు రూ. 550 కోట్లగా ఉన్నది ఇప్పుడు రూ. 5506.2 కోట్లకు చేరుకుని 1.1% పెరుగుదలను నమోదు చేసింది.
రైట్స్ ఎంటిటైల్మెంట్ షేర్స్
ఇంట్రాడే ట్రేడ్‌లో, 78 లక్షలకు పైగా షేర్ల వాల్యూమ్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఎంటిటైల్మెంట్ షేర్ ధరలు 16% పెరిగాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ తన సెషన్ ను రూ. 177 ల వద్ద తిరిగి తెరచిన తరువాత, రిలయన్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి 209.90 ను తాకి, సెషన్ ముగింపులో రూ.181.60 వద్ద స్థిరపడింది.
ప్రపంచ మార్కెట్ పైన లాక్ డౌన్ ప్రభావం
లాక్ డౌన్ పరిస్థితులలోని సదుపాయాల కారణంగా వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారాంభమవడం గురించి విక్రయదారులలో కొంత ఆశ చిగురించింది, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దారితీస్తుంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ వంటి చమురు ధరలు 1.5% తగ్గి బ్యారెల్ కు 35.62 డాలర్లకు పడిపోయాయి. అమెరికా మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం కావడంతో ప్రపంచ మార్కెట్ చిత్రము కొద్దిగా ప్రభావితమైంది. హాంగ్ కాంగ్ యొక్క హాంగ్ సెంగ్, వారి షేర్లు 1% తగ్గాయి మరియు కొనసాగుతున్న నిరసనల నడుమ మెయిన్ ల్యాండ్ వారి షేర్లు ఊగిసలాడుతున్నాయి.
యూరోపియన్ షేర్లు మహమ్మారి అనంతరం కోలుకునే పరిస్థితి పట్ల ఆశాజనకంగా ఉన్నాయి. బ్రిటన్ ఎఫ్‌టిఎస్ఇ 1% లాభపడింది మరియు దేశీయంపై దృష్టి కేంద్రీకరించిన ఎఫ్‌టిఎస్ఇ 250, పదకొండు వారాల గరిష్ట స్థాయిని తాకింది, ఎందుకంటే చాలా మంది రీటైలర్స్, జూన్ 1 నుండి తమ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత రూపాయి మానసిక స్థాయి 76ను కొనసాగించడం ద్వారా కొద్దిగా కఠిన శ్రేణిలో మారక వర్తకం చేసింది.