ఆసీస్ క్వాలిఫైయర్ ఎబ్డెన్‌పై నెగ్గిన స్పెయిన్ బుల్ నాదల్!

ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన జోరు మీదున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ క్వాలిఫైయర్ మాథ్యూ ఎబ్డెన్‌ను మట్టికరిపించాడు. లండన్‌లో జరుగుతున్న క్వీన్స్ టెన్నిస్ టోర్నమెంట్ రెండో రౌండ్లో మాథ్యూ ఎబ్డెన్‌తో తలపడిన రఫెల్ నాదల్ ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు.

తద్వారా 6-4, 6-4 పాయింట్ల వరుస సెట్ల తేడాతో రఫెల్ నాదల్ మాథ్యూపై నెగ్గాడు. ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ ఫైనల్లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌పై విజయం సాధించి, ఆరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను రఫెల్ నాదల్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.

మరో మ్యాచ్‌లో బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే బెల్జియంకు చెందిన ఎక్జావియర్ మలీస్సేపై విజయం సాధించాడు. ప్రపంచ నెంబర్ ఫోర్ ఆండీ ముర్రే 6-3, 5-7, 6-3 పాయింట్ల తేడాతో ఎక్జావియర్‌ను మట్టికరిపించాడు.

వెబ్దునియా పై చదవండి