ఐఓఏ మాజీ చీఫ్ కల్మాడీని ప్రశ్నించిన డోపింగ్ కమిటీ!

డోపింగ్ ఉదంతంపై ఐఓఏ మాజీ అధ్యక్షుడు సురేష్ కల్మాడీని ఒక సభ్యునితో కూడిన డోపింగ్ కమిటీ ప్రశ్నించింది. కామన్వెల్త్ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీకి డోపింగ్ ఉదంతంలోనూ ప్రమేయముందా లేదా అనే అంశంపై కమిటీ ప్రశ్నించింది.

డోపింగ్ వ్యవహారంపై గురువారం కేంద్ర క్రీడా శాఖచే జస్టీస్ ముఖుల్ ముద్గల్ కమిటీ నియమించబడింది. పంజాబ్, హర్యానాల హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టీస్‌గా పనిచేసిన ముద్గల్ డోపింగ్ ఉదంతంపై విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేష్ కల్మాడీని కూడా అనుమాన రీతిలో కమిటీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కాగా, సురేష్ కల్మాడీ సమయంలో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు పలువురు అథ్లెట్స్ పట్టుబడటంతో వారంతా బాయ్‌కట్ చేశారని పలు మీడియా సంస్థల్లో కథనాలు ప్రచురితమయ్యాయి.

అయితే, డోప్ టెస్టుల్లో పట్టుపడిన ఆసియన్ గేమ్స్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అశ్వినీ అక్కుంజీ, రిలే టీమ్‌మెంట్ మన్దీప్ కౌర్, సైసీ జోసే‌లతో పాటు మొత్తం ఎనిమిది మందిపై విచారణ జరిపేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఎనిమిది మంది అథ్లెంట్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

వెబ్దునియా పై చదవండి